దేశంలోని ఆలయాలకు ఆదర్శంగా యాదాద్రి ఉండాలి: సీఎం కేసీఆర్ - telangana varthalu
17:09 March 04
దేశంలోని ఆలయాలకు ఆదర్శంగా యాదాద్రి ఉండాలి: సీఎం కేసీఆర్
యాదాద్రి ఆలయ నిర్మాణం పనులు 90 శాతానికి పైగా పూర్తవడం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. యాదాద్రిలో పర్యటించిన సీఎం.. భక్తులు వైకుంఠ పుణ్యక్షేత్రంలోకి వచ్చిన అనుభూతి కలిగేలా తుది మెరుగులు దిద్దాలని సూచించారు. దేశంలోని ఆలయాలకు ఆదర్శంగా యాదాద్రి ఉండాలని.. మూల విరాట్టు స్వామి సేవలు దూరం నుంచి కూర్చొని చూసినా కనిపించేలా ఏర్పాట్లు చేయాలన్నారు.
విద్యుద్దీపాల కాంతులతో దేదీప్య మానంగా వెలిగే విధంగా విద్యుదీకరణ పనులు తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. రెయిలింగ్ పనులను ప్రశంసించిన ముఖ్యమంత్రి.. ఎస్కలేటర్ పనులు త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు.. యాదాద్రి పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి.. కొండపైన.. దిగువన యాడా చేపట్టిన అభివృద్ధి పనులు పరిశీలించారు. స్థపతి ఆనందసాయి, ఈవో గీతారెడ్డి, యాడా అధికారులు పనులకు సంబంధించిన వివరాలు తెలియజేశారు.
ఇదీ చదవండి: యాదాద్రిలో సీఎం పర్యటన... పునర్నిర్మాణ పనులపై ఆరా