తెలంగాణ

telangana

ETV Bharat / state

నిర్దేశిత సమయానికే యాదాద్రి ఆలయ పనులు పూర్తికావాలి: కేసీఆర్ - యాదాద్రి ఆలయం లేటెస్ట్​ వార్తలు

యాదాద్రి ఆలయ పునర్‌నిర్మాణ పనులపై... వైటీడీఏ అధికారులతో సీఎం కేసీఆర్‌ సమీక్ష నిర్వహించారు. ఆలయ పురోగతిపై అధికారులతో చర్చించారు. యాదాద్రి ఆలయం ప్రారంభంపై ప్రపంచ వ్యాప్తంగా భక్తులు ఆసక్తితో ఎదురుచూస్తున్నారని చెప్పారు.

cm kcr review on yadadri temple reconstruction in hyderabad
యాదాద్రి ఆలయ పునర్‌నిర్మాణ పనులపై సీఎం కేసీఆర్​ సమీక్ష

By

Published : Nov 7, 2020, 8:58 PM IST

Updated : Nov 7, 2020, 11:11 PM IST

యాదాద్రి ఆలయ పునర్‌నిర్మాణ పనులపై సీఎం కేసీఆర్​ సమీక్ష

రెండు మూడు నెలల్లో ప్రారంభించుకునేలా యాదాద్రి ఆలయ నిర్మాణ పనులు వేగవంతం చేయాలని సీఎం కేసీఆర్​ అధికారులను ఆదేశించారు. హైదరాబాద్​ యాదాద్రి ఆలయ పునర్‌నిర్మాణ పనులపై... వైటీడీఏ అధికారులతో సీఎం కేసీఆర్‌ సమీక్ష నిర్వహించారు. ఆలయ పరిసరాల్లో ప్రశాంతత ఫరిడవిల్లేలా భక్తి శ్లోకాలతో తీర్చిదిద్దాలన్నారు. యాదాద్రి ఆలయం ప్రారంభంపై ప్రపంచ వ్యాప్తంగా భక్తులు ఆసక్తితో ఎదురుచూస్తున్నారని చెప్పారు.

ఆర్టీసీ బస్టాండు నిర్మాణం కోసం ఏడు ఎకరాల స్థలం

ఆలయ నిర్మాణాలకు సంబంధించి నిధులు ప్రభుత్వం ఎప్పటికప్పుడు విడుదల చేస్తుందని స్పష్టం చేశారు. ఆలయ తుదిమెరుగులకు అనుభజ్జులైన శిల్పులతోనే పనులు చేయించాలని తేల్చి చెప్పారు. ఆర్టీసీ బస్టాండు నిర్మాణం కోసం గుట్ట సమీపంలో ఏడు ఎకరాల స్థలం కేటాయింపు చేస్తామన్నారు. బస్టాండు నిర్మాణ పనులు ఆలయ నిర్మాణ నియమాలను అనుసరించి జరగాలని సూచించారు. 11 ఎకరాల్లో మూడు వేలకు పైగా కార్లు పట్టేలా పార్కింగు ఏర్పాటు చేయాలన్నారు.

టెంపుల్ సిటీలో 250 డోనార్ కాటేజీలు

దక్షిణాది వంటకాలతో పాటు ఉత్తరాది వంటకాలు ఉండాలన్నారు. అంతర్జాతీయ భక్తుల కోసం వంటకాలను అందించాలని చెప్పారు. గండి చెరువును అత్యద్భుతమైన లాండ్ స్కేపింగుతో వాటర్ ఫౌంటెన్లతో తీర్చిదిద్దాలని చెప్పారు. బ్రహ్మోత్సవాలు, తెప్పోత్సవాలను నిర్వహించుకునేందుకు వీలుగా సుందరీకరణ పనులుండాలని తెలిపారు. యాదాద్రి టెంపుల్ సిటీలో 250 డోనార్ కాటేజీలను అత్యంత అద్భుతంగా తీర్చిదిద్దాలని అధికారులను ఆదేశించారు.

తొంభై ఎకరాల్లో భక్తి ప్రాంగణం

వీఐపీలతో పాటు సామాన్యుల దాకా బసచేసేందుకు వీలయ్యే రీతిలో వివిధ రకాల కాటేజీలను నిర్మించాలని సూచించారు. వేలాది మంది హాజరయ్యేలా కల్యాణ మండపాల నిర్మాణాలు ఉండాలని.. ప్రవచనాల కోసం లక్షలాది మంది కూర్చునేలా తొంభై ఎకరాల్లో భక్తి ప్రాంగణాన్ని నిర్మించాలన్నారు. దేవాలయ విమాన గోపురాన్ని బంగారు తాపడంతో తీర్చిదిద్దాల చెప్పారు. రింగు రోడ్డు నిర్మాణ పనులు వేగంగా పూర్తి చేయాలని సీఎం కేసీఆర్​ స్పష్టం చేశారు.

ఇదీ చదవండి:సినీ పరిశ్రమ అభివృద్ధికి అన్ని విధాల సహకరిస్తా: కేసీఆర్

Last Updated : Nov 7, 2020, 11:11 PM IST

ABOUT THE AUTHOR

...view details