యాదాద్రిలో ఆలయ పునర్నిర్మాణాల పరిశీలన అనంతరం... కొండపైన నూతనంగా నిర్మితమైన వీఐపీ అతిథిగృహంలో ముఖ్యమంత్రి కేసీఆర్ (Cm Kcr) సమీక్ష చేపట్టారు. మంత్రులు, ఉన్నతాధికారులు, యాడా యంత్రాంగం, వివిధ శాఖల అధికారులు హాజరయ్యారు.
Kcr Review: యాదాద్రి ఆలయ పనులపై సీఎం కేసీఆర్ సమీక్ష - యాదాద్రిపై సీఎం రివ్యూ
వరంగల్ పర్యటన అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ (Cm Kcr) యాదాద్రి చేరుకున్నారు. బాలాలయంలో శ్రీలక్ష్మినరసింహస్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయ పునర్నిర్మాణాలను పరిశీలించారు. అనంతరం అధికారులతో సమీక్ష చేపట్టారు.

కేసీఆర్ సమీక్ష
ఇప్పటికే తుది దశకు చేరుకున్న పనులను వెంటనే పూర్తిచేయాలని సీఎం (Cm Kcr) ఆదేశించారు. నిర్మాణాలను వేగవంతం చేసి వీలైనంత త్వరగా పనులు చేపట్టాలని సూచించారు. సమీక్ష ముగిసిన వెంటనే యాదాద్రి పర్యటన ముగించుకుని రోడ్డు మార్గం ద్వారా ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రానికి బయలుదేరి వెళ్లారు.
ఇదీ చూడండి: Cm Yadadri Visit: సీఎం యాదాద్రి పర్యటన... బాలాలయంలో దర్శనం