తెలంగాణ

telangana

ETV Bharat / state

సీఎం కేసీఆర్ ఆదేశంతో గ్రామబాట పట్టిన అధికారులు

యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం వాసాలమర్రి గ్రామంలో సీఎం ఓఎస్​డీ ప్రియాంక వర్గీస్, అధికారులు పర్యటించారు. వాసాలమర్రికి ఆనుకొని ఉన్న ఫారెస్ట్ ఏరియాను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

సీఎం కేసీఆర్ ఆదేశంతో గ్రామబాట పట్టిన అధికారులు
సీఎం కేసీఆర్ ఆదేశంతో గ్రామబాట పట్టిన అధికారులు

By

Published : Nov 2, 2020, 7:04 PM IST

యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం వాసాలమర్రి గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడానికి కావాల్సిన సదుపాయాలు అవసరాలు గురించి గ్రామస్థుల సలహాలు, సూచనలు స్వీకరించి వెంటనే నివేదిక సమర్పించాలని అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించడంతో, అధికారులంతా వాసాలమర్రి బాటపట్టారు.

ఉదయం సీఎం ఓఎస్​డీ ప్రియాంక వర్గీస్, ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ శోభ సహా పలువురు అధికారులు వాసాలమర్రిలో పర్యటించారు. వాసాలమర్రికి ఆనుకొని ఉన్న ఫారెస్ట్ ఏరియాను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అంతకు ముందు గ్రామ ప్రజాప్రతినిధులు, గ్రామ ప్రజలతో సమావేశమయ్యారు అధికారులు. గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడానికి గ్రామస్థుల సలహాలు సూచనలు స్వీకరించారు.

వాసాలమర్రికి ఆనుకొని ఉన్న క్లస్టర్-1, క్లస్టర్-2 గా ఉన్న అటవీ ప్రాంతాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించిన అధికారులు, ఫారెస్ట్ ఏరియాను సర్వహంగులతో, అన్ని సదుపాయాలతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతామన్నారు అటవీ అధికారులు. నరసింహస్వామి ఆలయం ఉన్న అటవీ ప్రాంతాన్ని ఆధ్యాత్మిక అటవీ ప్రాంతంగా అభివృద్ధి చేస్తామని, పండుగ సమయాల్లో గ్రామస్థులంతా వచ్చి పూజలు చేసే విధంగా ఫారెస్ట్ ఏరియాను ఆధ్యాత్మికత ఉట్టి పడేలా తయారు చేస్తామని చెప్పారు. గ్రామాభివృద్ధికి ప్రజల నుంచి పలు సూచనలు స్వీకరించి ఒక అభివృద్ధి ప్రణాళిక రూపొందించి త్వరలో సీఎంకు నివేదిక అందజేస్తామన్నారు అధికారులు.

ఇదీ చూడండి:'దుబ్బాకలో పెద్దఎత్తున డబ్బు, మద్యం పంపిణీ చేస్తున్నారు'

ABOUT THE AUTHOR

...view details