తెలంగాణ

telangana

ETV Bharat / state

యాదాద్రి ఆలయ అభివృద్ధి పనులు పరిశీలించిన కేసీఆర్ - CM kcr inspected Yadadri temple development works

ముఖ్యమంత్రి కేసీఆర్ యాదాద్రిలో పర్యటించారు. లక్ష్మీనరసింహస్వామిని ఆలయ పునర్‌నిర్మాణ పనులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఇప్పటివరకు పూర్తైన నిర్మాణాలు, పూర్తి కావొచ్చిన పనుల గురించి శిల్పి ఆనంద్ సాయి, స్థపతి ఆనందాచారి ముఖ్యమంత్రికి వివరిస్తున్నారు.

యాదాద్రి ఆలయ అభివృద్ధి పనులు పరిశీలించిన కేసీఆర్
యాదాద్రి ఆలయ అభివృద్ధి పనులు పరిశీలించిన కేసీఆర్

By

Published : Mar 4, 2021, 1:28 PM IST

Updated : Mar 4, 2021, 2:28 PM IST

ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఈరోజు మధ్యాహ్నం యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న సీఎంకు అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ఆయన బాలాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అర్చకులు తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం రాష్ట్రప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని పునర్నిర్మాణం చేపట్టిన యాదాద్రీశుడి ఆలయం పనులను సీఎం పరిశీలించారు. గత పర్యటన సందర్భంగా చేసిన సూచనల మేరకు పనులు జరిగాయా.. ఇంకా పూర్తి కావాల్సి ఉన్న పనుల గురించి తెలుసుకొని అధికారులకు దిశానిర్దేశం చేశారు.

ప్రధానాలయ ప్రాంగణంలో కలియదిరుగుతూ స్థపతి ఆనందాచారి వేలు, ఆనంద్‌సాయిని నిర్మాణ పనుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. మాడ వీధులు, ప్రాకార మండపాలు, విద్యుద్దీపాలు, దర్శన సముదాయాలను, తూర్పు రాజగోపురం, బ్రహ్మోత్సవం మండపాన్ని సీఎం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన అధికారులకు పలు సూచనలు చేశారు.

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఈ ప్రాజెక్టును రూ.1200 కోట్ల అంచనా వ్యయంతో 2016 అక్టోబరు 11న ప్రారంభించగా...ఇప్పటి వరకు సుమారు రూ. 850 కోట్ల వరకు ఖర్చయినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. 4.33 ఎకరాల్లో యాదాద్రి ప్రధాన ఆలయం రూపుదిద్దుకుంటోంది.

యాదాద్రి ఆలయ అభివృద్ధి పనులు పరిశీలించిన కేసీఆర్

ఇదీ చూడండి:యాదాద్రీశుడిని దర్శించుకున్న సీఎం కేసీఆర్​

Last Updated : Mar 4, 2021, 2:28 PM IST

ABOUT THE AUTHOR

...view details