యాదాద్రి ఆలయ పనులను పరిశీలించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్.. ఉదయం 11.30 సమయంలో యాదాద్రి చేరుకున్నారు. మొదటగా ప్రత్యేక బస్సులో కొండచుట్టూ తిరిగి రింగ్‌రోడ్డు నిర్మాణ పనులు పరిశీలించారు. మధ్య మధ్యలో వాహనాన్ని ఆపి పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం బాలాలయం చేరుకున్నారు. ఆలయ అర్చకులు, అధికారులు పూర్ణకుంభంతో సీఎంకు స్వాగతం పలికారు. బాలాలయంలో కేసీఆర్ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
పనుల పురోగతిపై పరిశీలన
నరసింహుని దర్శనం అనంతరం ఆలయ ఆవరణలో కలియ తిరుగుతూ నిర్మాణ పనులు ఎలా జరుగుతున్నాయో అధికారులను అడిగి తెలుసుకున్నారు. గర్భగుడి, మాడవీధులు, అష్టభుజి ప్రాకార మండపాల్లో శిల్పాలను సీఎం పరిశీలించారు. 32 నరసింహ అవతారాలు, వైష్ణవాచార్యులైన ఆళ్వారుల మండపాల నిర్మాణాలను తిలకించారు. పనుల తీరుతెన్నులను సీఎంకు వివరించిన ఆర్కిటెక్చర్ ఆనంద్‌సాయి స్థపతులు, శిల్పకళాకారులకు పలు సూచనలు చేశారు. వ్రత మండపం, శివాలయం పనులను పరిశీలించిన కేసీఆర్ యాదాద్రిలో తలపెట్టిన మహాసుదర్శన యాగంపై అర్చకులు, అధికారులతో చర్చించారు.
అసంతృప్తి... ఆగ్రహం