ముఖ్యమంత్రి కేసీఆర్ యాదాద్రి పర్యటనలో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. కరోనా ప్రభావంతో భక్తుల రాక తగ్గి ఆకలితో అలమటిస్తున్న వానరాలకు ముఖ్యమంత్రి ఆకలి తీర్చారు. ఆలయ పునర్ నిర్మాణ పనులు పరిశీలించి తిరిగి వెళ్తున్న కేసీఆర్ స్వయంగా వాహనం దిగి కోతులకు అరటిపండ్లు అందించారు. ఒక్కో వానరానికి తన చేతులమీదుగా పండ్లు అందించారు.
యాదాద్రిలో కోతులకు అరటిపండ్లు అందించిన కేసీఆర్ - అరటిపండ్లు అందించిన కేసీఆర్
యాదాద్రి ఘాట్రోడ్డులోని రెండో మలుపు వద్ద కోతుల గుంపు... ముఖ్యమంత్రి దృష్టిని ఆకర్షించింది. ఆకలితో అలమటిస్తున్న వానరాలకు స్వయంగా కేసీఆర్ అరటిపండ్లు అందించి... వాటి ఆకలిని తీర్చారు.
యాదాద్రిలో కోతులకు అరటిపండ్లు అందించిన కేసీఆర్
Last Updated : Sep 13, 2020, 5:56 PM IST