తెలంగాణ

telangana

ETV Bharat / state

ఉపఎన్నిక ప్రచారంలో భాజపా, తెరాస నేతల మధ్య ఘర్షణ.. చివరికి..! - భాజపా తెరాస ఉపఎన్నిక ప్రచారంలో స్వల్ప ఉద్రిక్తత

Clash Between BJP and TRS Leaders: చౌటుప్పల్‌ మండలం జైకేసారం గ్రామంలో తెరాస, భాజపా నేతల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. మాజీ ఎంపీ బూర నర్యయ్య గౌడ్ మాట్లాడుతుండగా.. తెరాస కార్యకర్తలు ఆయన ప్రసంగాన్ని అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకొని.. ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.

Clash between BJP and TRS leaders
Clash between BJP and TRS leaders

By

Published : Oct 22, 2022, 4:33 PM IST

చౌటుప్పల్‌లో భాజపా, తెరాస నేతల మధ్య తోపులాట

Clash Between BJP and TRS Leaders: యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం జైకేసారంలో భాజపా, తెరాస ఉప ఎన్నిక ప్రచారంలో స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఇటీవల తెరాస నుంచి భాజపాలో చేరిన భువనగిరి మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్.. ప్రచారంలో భాగంగా కేసీఆర్‌ను విమర్శిస్తుండగా తెరాస కార్యకర్తలు అడ్డుకున్నారు. దీనిని భాజపా కార్యకర్తలు అడ్డుకోవడం ఉద్రిక్తతలకు దారితీసింది.

ఇరువర్గాలు ఒకరి పైకి మరొకరు దూసుకెళ్లేందుకు ప్రయత్నించగా.. తోపులాట చోటుచేసుకుంది. పరస్పర అనుకూల, వ్యతిరేక నినాదాలతో ఘర్షణ వాతావరణం నెలకొంది. తెరాస కార్యకర్తలు ప్రసంగాన్ని అడ్డుకోవడాన్ని నిరసిస్తూ భాజపా నాయకులు రహదారిపై బైఠాయించి ధర్నాకు దిగారు. అనంతరం పోలీసులు ఇరువర్గాలను శాంతింపజేశారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details