సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ఇవాళ యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకోనున్నారు. ఉదయం ఏడు గంటలకు హైదరాబాద్ నుంచి బయలుదేరనున్న సీజేఐ... 8 గంటల తర్వాత యాదాద్రి చేరుకుంటారు.
యాదాద్రీశున్ని దర్శించుకోనున్న సీజేఐ ఎన్వీ రమణ - యాదాద్రీశున్ని దర్శించుకోనున్న సీజేఐ ఎన్వీ రమణ
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని సీజేఐ ఎన్వీ రమణ దర్శించుకోనున్నారు. పునర్నిర్మిస్తున్న ఆలయాన్ని సందర్శించనున్న సీజేఐ.. ప్రెసిడెన్షియల్ విల్లా సూట్లతో పాటు... ఆలయనగరిని పరిశీలించనున్నారు.
cji nv ramana visit yadadri today
బాలాలయంలో లక్ష్మీనర్సింహస్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేస్తారు. వేదపండితుల ఆశీర్వచనం అనంతరం.. పునరుద్ధరించిన ఆలయాన్ని జస్టిస్ ఎన్వీరమణ సందర్శిస్తారు. ప్రెసిడెన్షియల్ విల్లా సూట్లతో పాటు ఆలయనగరిని పరిశీలించి హైదరాబాద్ తిరుగు పయనమవుతారు.