తెలంగాణ

telangana

ETV Bharat / state

భువనగిరి కోట అద్భుతం.. సాహస క్రీడల్లో ఉత్సాహంగా గడిపిన సివిల్​ సర్వీసెస్​ ట్రైనీలు - భువనగిరి కోట తాజా వార్తలు

Civil service traines visit Bhuvanagiri Fort: యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి కోటకి పర్యటకుల తాకిడి క్రమక్రమంగా పెరుగుతోంది. తాజాగా భువనగిరి కోటను వివిధ రాష్ట్రాలకు చెందిన సివిల్ సర్వీసెస్ ట్రైనీ అధికారులు సందర్శించారు. సాహస క్రీడల్లో పాల్గొని ఉత్సాహంగా గడిపారు. ఒకటే రాయితో గుట్ట ఏర్పడటం చూడటానికి అద్భుతంగా ఉందన్నారు.

Bhuvanagiri Fort: భువనగిరి కోటను సందర్శించిన సివిల్​ సర్వీస్​ ట్రైనీలు
Bhuvanagiri Fort: భువనగిరి కోటను సందర్శించిన సివిల్​ సర్వీస్​ ట్రైనీలు

By

Published : Feb 13, 2022, 3:36 PM IST

Updated : Feb 13, 2022, 3:46 PM IST

భువనగిరి కోట అద్భుతం.. సాహస క్రీడల్లో ఉత్సాహంగా గడిపిన సివిల్​ సర్వీసెస్​ ట్రైనీలు

Civil service traines visit Bhuvanagiri Fort: యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని భువనగిరి కోటను వివిధ రాష్ట్రాలకు చెందిన సివిల్ సర్వీసెస్ ట్రైనీ అధికారులు సందర్శించారు. వీరంతా హైదరాబాద్​లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల శిక్షణ సంస్థలో ఫౌండేషన్ కోర్సులో శిక్షణ పొందుతున్నారు. ఆదివారం సెలవు దినం కావడంతో ఉత్సాహం గడిపేందుకు సంస్థ తరఫున ఇక్కడికి వచ్చినట్లు వారు వెల్లడించారు. కోట వద్ద రాక్ క్లైంబింగ్, ర్యాప్లింగ్​, జిప్‌లైన్ సాహస క్రీడల్లో పాల్గొని ఉత్సాహంగా గడిపారు.

మొదటి సారి రాక్​క్లైంబింగ్​ కోసం ఇక్కడికి వచ్చామని సివిల్​ సర్వీస్​ ట్రైనీ అధికారులు పేర్కొన్నారు. చాలా బాగుందని కితాబిచ్చారు. తెలంగాణ ప్రభుత్వం అడ్వెంచర్ కోసం ఇలాంటి స్కూల్స్ ఏర్పాటు చేయటం సంతోషంగా ఉందన్నారు. ఇక్కడ శిక్షకులు చాలా సేఫ్​గా రాక్ క్లైంబింగ్ , ర్యాప్లింగ్​, జిప్​లైన్ చేయిస్తున్నారని అన్నారు.

చాలా కష్టపడి చదివి ఈ రోజు ఉన్నత స్థానంలో నిలిచామని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. భువనగిరి గుట్ట అద్భుతంగా ఉందని, ఇలాంటి గుట్టను తాము ఎప్పుడూ చూడలేదన్నారు. ఒకటే రాయితో గుట్ట ఏర్పడటం చూడటానికి అద్భుతంగా ఉందన్నారు.

సంతోషంగా ఉంది..

మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల శిక్షణ సంస్థలో ఫౌండషన్ కోర్సులో శిక్షణ పొందుతున్నాం. వారు తమని ఇక్కడికి తీసుకువచ్చారు. తెలంగాణ ప్రభుత్వం అడ్వెంచర్ కోసం ఇలాంటి స్కూల్స్ ఏర్పాటు చేయటం సంతోషంగా ఉంది. ఇక్కడ శిక్షకులు చాలా సేఫ్​గా రాక్ క్లైంబింగ్ , ర్యాప్లింగ్​, జిప్​లైన్ చేయిస్తున్నారు.

-సివిల్​ సర్వీస్​ ట్రైనీ అధికారి.

ఇదీ చదవండి:

Last Updated : Feb 13, 2022, 3:46 PM IST

ABOUT THE AUTHOR

...view details