లాక్‌డౌన్ సమయంలో విధులు నిర్వర్తిస్తున్న పోలీసులు, పాత్రికేయుల సేవలు మరువలేనివని సినీ నటుడు, మాజీ మంత్రి బాబుమోహన్ అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు చెక్‌పోస్టు వద్ద 163వ జాతీయ రహదారిపై పోలీసులకు, పాత్రికేయులకు ఆయన మాస్కులు, శానిటైజర్‌లు అందించారు. ప్రజల సమస్యలు గుర్తించడంలో పోలీసులు, జర్నలిస్టుల పాత్ర కీలకమని ఆయన తెలిపారు. వారికి సాయం చేయాలనే ఉద్దేశంతోనే మాస్కులు, శానిటైజర్‌లను వారికి పంపిణీ చేశామన్నారు.
ఆలేరులో మాస్కులు పంచిన నటుడు బాబుమోహన్ - బాబుమోహన్ మాస్కుల పంపిణీ
యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులో పోలీసులు, పాత్రికేయులకు మాదీ మంత్రి, సినీనటుడు బాబుమోహన్ మాస్కులు, శానిటైజర్లు పంపిణీ చేశారు. కరోనా వ్యాప్తిని నివారించేందుకు నిరంతరం కృషిచేస్తున్న పోలీసులు, పాత్రికేయుల సేవలు వెలకట్టలేనివన్నారు.
![ఆలేరులో మాస్కులు పంచిన నటుడు బాబుమోహన్ ఆలేరులో మాస్కులు పంచిన నటుడు బాబుమోహన్](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6852208-815-6852208-1587277172710.jpg)
ఆలేరులో మాస్కులు పంచిన నటుడు బాబుమోహన్