తెలంగాణ

telangana

ETV Bharat / state

ఈటీవీ భారత్ కథనానికి స్పందన.. పసివాడికి పోషణ - response to etv bharat story

ఆ మహిళ పాలిట అనుమానం పెనుభూతమయింది. అత్తింటి వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకునేందుకు దారితీశాయి. తల్లి మరణంతో రెండు నెలల పసికందు అనాథగా మారాడు. అమ్మ ఒడిలో ఆడుకోవాల్సిన ఆ పసిబిడ్డకు ఆ ఊరి ప్రజలు ఆసరాగా మారారు. యాదాద్రి జిల్లా చొల్లేరులో డిసెంబర్​ 31న ఆత్మహత్యకు పాల్పడిన మహిళ కుమారుడి దీనస్థితిపై ఈటీవీ భారత్​ 'కన్నా.. అమ్మలేదని రాదని చెప్పనా!' అనే పేరుతో రాసిన కథనానికి ఆ గ్రామస్థులు స్పందించారు.

response to etv bharat story on women death
పసివాడి పోషణకు ఆర్థిక సాయం

By

Published : Jan 4, 2021, 7:44 PM IST

యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం చొల్లేరు గ్రామంలో అత్తింటి వేధింపులు భరించలేక పూజశ్రీ అనే వివాహిత డిసెంబర్ 31న ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. తల్లి మరణంతో అనాథగా మారిన రెండు నెలల పసికందు దీనస్థితిపై ఈటీవీ భారత్​లో ప్రచురించిన కన్నా.. అమ్మలేదని రాదని చెప్పనా అనే కథనానికి చొల్లేరు గ్రామస్థులు స్పందించారు.

పసివాడి పోషణకు ఆర్థిక సాయం

కన్నతల్లి ప్రేమకు దూరమైన ఆ పసిబిడ్డను చూసి చలించిన కొందరు వ్యక్తులు, నాయకులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి తమ ఔదార్యాన్ని చాటుకున్నారు. చొల్లేరు గ్రామ సర్పంచ్ బీరయ్య, జడ్పీటీసీ సభ్యురాలు అనురాధ, ఎంపీటీసీ అరుణ, గ్రామస్థులు రూ.61వేలు జమచేసి బాలుని పోషణ కోసం అతని అమ్మమ్మ సునీతకు అందజేశారు. పక్కన గ్రామాలకు చెందిన మరికొందరు బాలుని సంరక్షణ కోసం రూ.10వేలు ఇచ్చినట్లు ఆమె తెలిపారు.

మలి వయసులో ఆ వృద్ధురాలు ఒంటరిగా బాలుని పోషం చూడటం కష్టమని, ప్రభుత్వం స్పందించి ఆమెకు సాయం చేయాలని చొల్లేరు గ్రామస్థులు విజ్ఞప్తి చేశారు.

ABOUT THE AUTHOR

...view details