యాదాద్రి భువనగిరి జిల్లాలోని యాదగిరిగుట్ట మండల పరిధిలోని చొల్లేరులో 550 కుటుంబాలు ఉన్నాయి. వాటిలో సుమారు 350 కుటుంబాలకు వ్యవసాయమే జీవనాధారం. వారంతా సాగుతో పాటు ప్రత్యామ్నాయంగా ప్రారంభించిన పాడి పరిశ్రమ మంచి లాభాలు తెచ్చిపెడుతోంది. ప్రతి ఇంటికి కనీసం రెండు నుంచి ఆరు పాడి ఆవులు ఉండని కుటుంబమే లేదంటే పాడిపై వారు కనబరుస్తున్న ఆసక్తి తెలుస్తుంది. రైతులతో పాటు కుల వృత్తుల వారు పశువులను పెంచుకుంటున్నారు. ప్రతి కుటుంబం నిత్యం పది నుంచి 70 లీటర్ల వరకు పాలు విక్రయిస్తున్నారు.
రోజుకు 2500 లీటర్లు
చొల్లేరులో నెలకొల్పిన మదర్ డైరీ సెంటర్కు రోజు సుమారు 1600 లీటర్ల పాలు వస్తాయని నిర్వాహకులు చెబుతున్నారు. ఇతర ప్రైవేట్ సెంటర్లు, సొంతంగా ఇతర ప్రాంతాలకు తరలించే వారు ఇలా మొత్తంగా సుమారు 2,500 లీటర్ల వరకు పాలు విక్రయిస్తున్నారు. పాడి పరిశ్రమ లాభాదాయకంగా ఉండడం వల్ల వ్యవసాయం వదిలేసి చాలామంది పాడివైపే మొగ్గుచూపుతున్నారు.
సబ్సిడీపై పశువుల పంపిణీ
రాష్ట్రంలో పాడి సంపదను పెంచాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో అధికారులు చర్యలు చేపట్టారు. పశుసంవర్ధక శాఖ నుంచి రైతులకు సబ్సిడీపై గేదెలు మంజూరు చేశారు. జిల్లాలోనే అత్యధికంగా చొల్లేరులోనే 120 పాడిగేదెలను కొనుగోలు చేశారు.
మరింత ఉత్పత్తి పెంచాలి