యాదాద్రి భువనగిరి జిల్లాలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యాదాద్రి పుణ్యక్షేత్ర పునర్నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయి. ఆలయంలో చేపట్టిన పలు నిర్మాణాల నమూనాలను త్రిదండి చినజీయర్ స్వామి పరిశీలించారు. ఈ మేరకు యాదాద్రి ఆలయ ఈవో గీతారెడ్డి, ఆర్కిటెక్చర్ ఆనందసాయి, స్థపతి వేలు శంషాబాద్‌లోని చినజీయర్ స్వామి ఆలయంలో ఆయనను కలిశారు. సాలహారాల విగ్రహ డిజైన్ల్, బ్రాస్ క్యూలైన్ల ఎంట్రీ, ఆలయంలో పూర్తయిన, కొనసాగతున్న నిర్మాణ పనులను ఈవో గీతారెడ్డి చినజీయర్ స్వామికి వివరించారు. ఆలయంలో నిర్మించనున్న సాలహారాల్లో పొందు పరిచే కృష్ణశిలతో చేసిన శ్రీ కృష్ణుని ఆకృతులను, దర్శన క్యూలైన్లు, ప్రసాదాల విభాగం, పుష్కరిణి, క్షేత్ర సన్నిధిలో చేపడుతున్న పనులు, వాటి నమూనాలను చినజీయర్ స్వామి పరిశీలించారు.
యాదాద్రి ఆలయ నిర్మాణ నమూనాలను పరిశీలించిన చినజీయర్ స్వామి - త్రిదండి చినజీయర్ స్వామి
యాదాద్రి ఆలయంలో చేపడుతున్న పలు నిర్మాణాల నమూనాలను త్రిదండి చినజీయర్ స్వామి పరిశీలించారు. ఈ మేరకు యాదాద్రి ఈవో గీతారెడ్డి, ఆర్కిటెక్చర్ ఆనందసాయి, స్థపతి వేలు శంషాబాద్‌లోని ఆశ్రమంలో చినజీయర్ స్వామిని కలిశారు. యాదాద్రి ఆలయ అభివృద్ధిలో భాగంగా చేపడుతున్న సాలహారాల విగ్రహ డిజైన్లు, శ్రీ కృష్ణుని రూపాలు, పుష్కరిణి తదితర నిర్మాణాల నమూనాలను త్రిదండి చినజీయర్ స్వామి పరిశీలించారు.
యాదాద్రి ఆలయ నిర్మాణ నమూనాలను పరిశీలించిన చినజీయర్ స్వామి