యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్ మున్సిపాలిటీ పరిధిలోని కొండగడపకి చెందిన గోలి వెంకన్న ఈనెల 14న హైదరాబాద్ ఉప్పల్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. గోలి వెంకన్న కుటుంబానికి చిన్ననాటి స్నేహతులు సాయం చేశారు.
అండగా నిలిచిన చిన్ననాటి స్నేహితులు - yadadru bhuvanagiri district latest news
రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన స్నేహితుని కుటుంబానికి చిన్ననాటి స్నేహితులు సాయం చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్ మున్సిపాలిటీ పరిధిలోని కొండగడపకి చెందిన గోలి వెంకన్న రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. మృతుడి కుటుంబానికి రూ.50,000 వేల నగదు అందించారు.
అండగా నిలిచిన చిన్ననాటి స్నేహితులు
వెంకన్న భార్య, పిల్లలని పరామర్శించి తాత్కాలిక ఖర్చులుకు గాను రూ.10,000 అందించారు. వెంకన్న ఇద్దరు కుమార్తెల పేరు మీద ఒక్కొక్కరికి రూ.20,000 వేల చొప్పున మొత్తం రూ.40,000 రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ చేశారు. ఈ కార్యక్రమంలో మోత్కూర్ మున్సిపాలిటీ తెరాస ప్రధాన కార్యదర్శి కందుల విక్రాంత్ పాల్గొన్నారు.
ఇవీచూడండి:జాతీయ ఫోటోగ్రఫీ పోటీల్లో రాష్ట్రానికి రెండు అవార్డులు