తెలంగాణ

telangana

ETV Bharat / state

'సమ్మె విషయంలో ముఖ్యమంత్రి మొండి వైఖరి వీడాలి'

ఆర్టీసీ కార్మికుల సమ్మె విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్​ ఇకనైనా తన మొండి వైఖరి విడనాడాలని ఆర్టీసీ జేఏసీ రాష్ట్ర కో-కన్వీనర్​ కొమురెల్లి రాజిరెడ్డి కోరారు.

'సమ్మె విషయంలో ముఖ్యమంత్రి మొండివైఖరి వీడాలి'

By

Published : Nov 12, 2019, 7:44 PM IST

ఆర్టీసీ సమ్మె విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఇకనైనా తన మొండి వైఖరిని మానుకొని.. కార్మికుల సమస్యలను పరిష్కరించాలని ఆర్టీసీ జేఏసీ రాష్ట్ర కో- కన్వీనర్ కొమురెల్లి రాజిరెడ్డి కోరారు. యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని సీపీఐ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. కార్మికుల పట్ల కేసీఆర్ తన వైఖరిని తక్షణమే మార్చుకోవాలన్నారు. ఆర్టీసీని అమ్మేసే కుట్రలో భాగంగానే ఆయన ఇలా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. ఆర్టీసీని ప్రైవేటు పరం చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. కార్మికులు 39 రోజులుగా సమ్మె చేస్తున్నా ముఖ్యమంత్రి స్పందించక పోవడం దారుణమన్నారు. ఇప్పటికైనా కార్మికులతో చర్చలు జరిపి తమ సమస్యలు పరిష్కరించాలన్నారు. లేదంటే సమ్మెను మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.

'సమ్మె విషయంలో ముఖ్యమంత్రి మొండివైఖరి వీడాలి'

ABOUT THE AUTHOR

...view details