తెలంగాణ

telangana

ETV Bharat / state

CM KCR: సర్పంచ్​తో ఫోన్​లో మాట్లాడిన ముఖ్యమంత్రి కేసీఆర్​ - Chief Minister KCR spoke on the phone with Vasalamarri Sarpanch

యాదాద్రి భువనగిరి జిల్లా వాసాలమర్రి గ్రామ సర్పంచ్​తో ముఖ్యమంత్రి కేసీఆర్​ ఫోన్​లో మాట్లాడారు. ఈనెల 22న పర్యటిస్తానని.. గ్రామస్థులతో కలిసి సహపంక్తి భోజనం చేస్తామని... ఏర్పాట్లు చేయాలని సర్పంచ్​కు సూచించారు.

cm kcr
వాసాలమర్రి సర్పంచ్​తో ఫోన్​లో మాట్లాడిన ముఖ్యమంత్రి కేసీఆర్​

By

Published : Jun 18, 2021, 4:24 PM IST

వాసాలమర్రి సర్పంచ్​తో ఫోన్​లో మాట్లాడిన ముఖ్యమంత్రి కేసీఆర్​

ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఈనెల 22న యాదాద్రి భువనగిరి జిల్లా వాసాలమర్రిలో పర్యటించనున్నారు. వాసాలమర్రి సర్పంచ్‌తో ఫోన్‌లో మాట్లాడిన.. ఏర్పాట్లు చేయాలని సూచించారు. గ్రామస్థులతో కలిసి సహపంక్తి భోజనం చేస్తామని... ఆ తర్వాత బహిరంగ సభలో పాల్గొంటానని తెలిపారు. గ్రామ అభివృద్ధికి నిధులు కేటాయిస్తానని సర్పంచ్‌కు హామీ ఇచ్చారు. సీఎం కేసీఆర్‌ పర్యటన నేపథ్యంలో ఆలేరు ఎమ్మెల్యే సునీత, కలెక్టర్‌ పమేలా సత్పతి... వాసాలమర్రిలో పర్యటించారు. సభ కోసం ఏర్పాట్లు పరిశీలించారు.

ABOUT THE AUTHOR

...view details