ఈనెల 28న ముఖ్యమంత్రి కేసీఆర్... యాదాద్రికి వస్తున్నట్లు సమాచారం. పంచ నారసింహుల క్షేత్రాన్ని సీఎం సందర్శించనున్నట్లు తెలుస్తోంది. ఆలయ పనులు పూర్తి కావొస్తున్న నేపథ్యంలో స్వయంగా ఆయన పర్యవేక్షించనున్నట్లు అధికార వర్గాలు అంచనా వేస్తున్నాయి.
ఈనెల 28న యాదాద్రికి ముఖ్యమంత్రి కేసీఆర్! - Telangana news
ముఖ్యమంత్రి కేసీఆర్... ఈనెల 28న యాదాద్రికి రానున్నట్లు తెలుస్తోంది. ఆలయ పనులు పూర్తి కావొస్తున్న నేపథ్యంలో స్వయంగా ఆయన పర్యవేక్షించనున్నట్లు అధికార వర్గాలు అంచనా వేస్తున్నాయి.
ఈనెల 28న యాదాద్రికి ముఖ్యమంత్రి కేసీఆర్!
ప్రధాన ఆలయంతో పాటు అనుబంధ శివాలయం, కొండపైన విష్ణు పుష్కరిణి, రథశాల, క్యూ కాంప్లెక్స్‌లు, క్యూ లైన్ పనులు, ఆలయ ఈవో కార్యాలయం, వీఐపీ వసతి పునర్నిర్మాణాలు దాదాపు పూర్తి కావొస్తున్నాయి. పనులను మరింత వేగవంతం చేసి త్వరగతిన పూర్తి చేసేలా సీఎం తన పర్యటనలో దిశానిర్దేశం చేయనున్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి.