తెలంగాణ

telangana

ETV Bharat / state

యాదాద్రి జిల్లాలో స్మిత సబర్వాల్ పర్యటన - బస్వాపురం ప్రాజెక్టు సందర్శించిన స్మతా సబర్వాల్

యాదాద్రి భువనగిరి జిల్లాలో ముఖ్యమంత్రి కార్యాలయ కార్యదర్శి స్మిత సబర్వాల్ పర్యటించారు. భువనగిరి మండలంలోని బస్వాపూర్ ప్రాజెక్టును పరిశీలించారు. పనుల పురోగతి గురించి అధికారులు, కాంట్రాక్టర్లను అడిగి తెలుసున్నారు.

chief minisdter office chief secretery smitha sabarwal visit basvapuram project in yadadri
స్మిత సబర్వాల్ బస్వాపూరం ప్రాజెక్టు పరిశీలన

By

Published : Mar 18, 2020, 11:05 PM IST

యాదాద్రి భువనగిరి జిల్లా బస్వాపూర్ రిజర్వాయర్​ని ముఖ్యమంత్రి కార్యాలయ కార్యదర్శి స్మిత సబర్వాల్ సందర్శించారు. పనుల పురోగతి గురించి ప్రాజెక్టు అధికారులని అడిగి తెలుసుకున్నారు. జూన్-జులై వరకు పనులు పూర్తి చేసి 1.5 టీఎంసీల నీటిని నిల్వ చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

రిజర్వాయర్ కట్ట, కాల్వ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను స్మిత సబర్వాల్ నిర్ధేశించారు. అనంతరం బస్వాపురం క్యాంప్ కార్యాలయంలో ఇంజినీరింగ్ అధికారులు, కాంట్రాక్టర్లతో సమీక్షించారు. బస్వాపురం, వడపర్తి, తిమ్మాపూర్ భూసేకరణ పూర్తి చేసి, వెంటనే నిధుల విడుదలకు చర్యలు తీసుకుంటామన్నారు. ఆమె వెంట కలెక్టర్ అనిత రామచంద్రన్, అదనపు కలెక్టర్ రమేష్ ఉన్నారు.

స్మిత సబర్వాల్ బస్వాపూరం ప్రాజెక్టు పరిశీలన

ఇవీ చూడండి:స్వదేశానికి విద్యార్థులు.. ఊపిరి పీల్చుకున్న తల్లిదండ్రులు

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details