ముఖ్యమంత్రి కేసీఆర్.. అభివృద్ధి పేరిట రాష్ట్రాన్ని దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థి చెరుకు సుధాకర్. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కురు మున్సిపాలిటీ కేంద్రంలో ఆయన మీడిమా సమావేశం ఏర్పాటు చేశారు.
రాష్ట్రంలో ఏ యూనివర్సిటీలో కూడా ఒక్క పోస్ట్ కూడ భర్తీ చేయలేదన్నారు. ప్రభుత్వ విశ్వవిద్యాలయాల దుస్థితి ఈ విధంగా ఉంటే వీటికి పునర్ వైభవం తీసుకరాకుండా పల్లా రాజేశ్వర్ రెడ్డికి మాత్రం ప్రైవేట్ యూనివర్సిటీకి అనుమతి ఎలా ఇచ్చారని ఆయన ప్రశ్నించారు.