తెలంగాణ

telangana

ETV Bharat / state

లాక్​డౌన్​ సాయం అందించండి.. చేనేతల మౌన పోరాటం..

ప్రభుత్వం చేనేత కార్మికులను ఆదుకోవాలని చేనేత ఐక్య కార్యాచరణ సమితి నాయకులు గర్దాసు నర్సింహ ప్రభుత్వాన్ని డిమాండ్​ చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలోని తహశీల్దార్​ కార్యాలయం ముందు మౌనదీక్ష చేశారు.

By

Published : Jun 17, 2020, 3:24 PM IST

Chenetha Workers Protest In Valigonda For Lock Down Help
లాక్​డౌన్​ సాయం అందించాలని.. మౌనదీక్ష చేసిన చేనేత కుటుంబాలు

యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలో చేనేత ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో చేనేత కార్మికులు మౌనదీక్ష చేపట్టారు. మండల కేంద్రం నుంచి తహశీల్దార్​ కార్యాలయం వరకు ర్యాలీ తీసి అనంతరం మౌనదీక్ష చేశారు. చేనేత కార్మికుల ఐక్య కార్యాచరణ సమితి నాయకులు గర్దాసు నర్సింహ ఆధ్వర్యంలో తహశీల్దార్​ నాగలక్ష్మికి వినతిపత్రం సమర్పించారు. కరోనా వల్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్​డౌన్​ విధించడం వల్ల చేనేత రంగం సంక్షోభంలో పడిందని నాయకులు గర్దాసు నర్సింహ అన్నారు.

గత సంవత్సరం నూలుపై ఇవ్వాల్సిన సబ్సీడీ బకాయిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. నిల్వ ఉన్న వస్త్రాలను ప్రభుత్వమే కొనుగోలు చేసి.. ప్రతి చేనేత కుటుంబానికి 6 నెలల పాటు, నెలకు రూ.8వేల చొప్పున ఆర్థిక సాయం అందించాలని చేనేత కార్మికులు కోరారు.

ఇవీ చూడండి:కరోనా నిర్ధారణ కోసమెళ్తే.. అంటుకునేలా చేస్తున్నారు!

ABOUT THE AUTHOR

...view details