మల్కాజిగిరి ఏసీపీ నరసింహారెడ్డి అవినీతి ఆరోపణల నేపథ్యంలో అతనితో వ్యవహరాలు నడిపిన వారి ఇళ్లలో ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలం ఇంద్రియాలకు చెందిన చంద్రశేఖర్ ఇంట్లో సోదాలు జరిపారు.
ఏసీపీ బంధువులు, స్నేహితుల ఇళ్లలో తనిఖీలు - Malkajgiri ACP Narasimha Reddy latest news
మల్కాజిగిరి ఏసీపీ నరసింహారెడ్డి అవినీతి ఆరోపణల నేపథ్యంలో.. ఆయన బంధువులు, స్నేహితుల ఇళ్లలో అనిశా అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలం ఇంద్రియాలకు చెందిన చంద్రశేఖర్ ఇంట్లో సోదాలు జరిపారు.
![ఏసీపీ బంధువులు, స్నేహితుల ఇళ్లలో తనిఖీలు checks-at-the-homes-of-his-relatives-and-friends](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8906871-480-8906871-1600855501416.jpg)
ఏసీపీ బంధువులు, స్నేహితుల ఇళ్లలో తనిఖీలు
నర్సింహ రెడ్డి ఈ మధ్యకాలంలో చంద్రశేఖర్‌తో వ్యవహారం నడిపినట్టుగా అనుమానిస్తూ తనిఖీలు చేసినట్లు ఏసీబీ అధికారి ప్రవీణ్ కుమార్ వెల్లడించారు. ఏసీపీ నరసింహారెడ్డిపై ఆదాయానికి మించి ఆస్తుల కేసు నమోదు చేసిన అనిశా అధికారులు ఏకకాలంలో 35 చోట్ల సోదాలు చేస్తున్నారు.
ఇదీ చూడండి :మల్కాజిగిరి ఏసీపీ నరసింహారెడ్డి ఇంట్లో ఏసీబీ సోదాలు