యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లో చికెన్ ప్రియులు పండుగ చేసుకుంటున్నారు. ఘుమఘుమల చికెన్ వంటకాలు చేసుకునేందకు సిద్ధమయ్యారు. జనాలకు అమ్ముతున్నారు. గ్రామంలోని ఓ చికెన్ సెంటర్ యజమాని కేవలం వంద రూపాయలకే రెండు కోళ్లు అమ్ముతున్నాడు. కరోనా వైరస్ కారణంగా కోళ్ల అమ్మకాలు భారీగా తగ్గిపోయి... రెండు తెలుగు రాష్ట్రాల్లో పౌల్ట్రీ పరిశ్రమ సుమారు రూ.2000 కోట్ల నష్టాలను చవిచూసింది.
బంపర్ ఆఫర్... రూ. వందకే నాలుగు కిలోల చికెన్!
రావాలండీ... రావాలి... ఆలోచించిన ఆశాభంగం...కేవలం రూ.100 కే రెండు కోళ్లు... ఈ బంపర్ ఆఫర్ ఈరోజు మాత్రమే...! ఇదంతా ఏంటీ అనుకుంటున్నారా... నిజమండీ... యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పలోని ఓ చికెన్దుకాణ యజమాని కరోనాపై చేపట్టిన అవగాహన కార్యక్రమం ఇది!
CHECKEN SHPO OWNER SELLING LIVE CHICKEN WITH LOWEST PRICE AT CHOWTUPPAL
కోళ్లకు కరోనా వైరస్ ఉండదని ప్రజల్లో అవగాహన కల్పిస్తూ... కేవలం రూ.వందకే సుమారు 4 కిలోలున్న రెండు కోళ్లను అమ్ముతున్నామని దుకాణ యాజమాని తెలిపాడు. ఈ రకంగా చూస్తే.... ఒక కిలో కోడి మాంసం ఇంచుమించుగా రూ.25 కే వస్తోంది. ఈ ఆఫర్ విని కోళ్లను ఎగబడి కొనుక్కుంటున్నారు.
ఇదీ చూడండి:ఎస్ బ్యాంక్ వ్యవస్థాపకుడిపై 'మోసం, అవినీతి' కేసులు
Last Updated : Mar 9, 2020, 11:31 AM IST