యాదాద్రి జిల్లా మోత్కూరు మున్సిపాలిటీలోని గాంధీనగర్‌కు చెందిన బాషా.. కొంతకాలంగా పక్షవాతంతో బాధపడుతున్నారు. విషయం తెలుసుకున్న 'మన మోత్కూర్' వాట్సాప్ గ్రూప్ సభ్యులు.. దాతల ద్వారా డబ్బు సేకరించారు. రూ. 55 వేల నగదును.. మున్సిపల్ కమిషనర్ షేక్ మహమూద్ చేతులమీదుగా బాధితుడికి అందించి అండగా నిలిచారు.
వాట్సాప్ గ్రూప్ సభ్యుల దాతృత్వం - మోత్కూరు మున్సిపాలిటీ వార్తలు
గ్రామాల్లో ఉండేవారు సాధారణంగా తమ ఊరి పేరు మీద వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసుకుంటారు. అందులో గ్రామంలోని విషయాలు, గ్రామస్థుల బాగోగులు అడిగి తెలుసుకుంటూ ఉంటారు. అయితే అంతటితో ఆగని యాదాద్రి జిల్లా మోత్కూర్ వాసులు.. అనారోగ్యంతో బాధపడుతోన్న ఓ స్థానికుడికి ఆర్థిక సాయం అందించి అండగా నిలిచారు.
Help from WhatsApp group members
కరోనా సంక్షోభంలో.. 'మన మోత్కూర్' వాట్సాప్ గ్రూప్ సభ్యులు ఎంతో మందిని ఆదుకున్నారని మున్సిపల్ కమిషనర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి యాదయ్య, ఎంపీడీవో మనోహర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి:Viral: తేనె తెట్టెను చేతితో తొలగించిన మహిళ