యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం బోల్లెపల్లి గ్రామానికి చెందిన గోర్ల ప్రవళిక నిన్న రాత్రి కుటుంబసభ్యులతో కలిసి ఆరుబయట నిద్రించింది. తెల్లవారుజామున 3 గంటల సమయంలో గుర్తుతెలియని దుండగుడు ఆమె మెడలో ఉన్న నాలుగున్నర తులాల బంగారు పుస్తెల తాడుని లాక్కెళ్తుండగా... గమనించిన బాధితురాలు కేకలు వేసింది. ఆమె భర్త దుండగుడిని పట్టుకునేందుకు ప్రయత్నించగా... అతను పారిపోయాడని తెలిపారు. పోలీసులు డాగ్ స్క్వాడ్‌తో చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
'ఆరుబయట నిద్రిస్తే... పుస్తెల తాడు పోయింది' - chain snatching
వేసవిలో హాయిగా ఉంటుందని ఆరుబయట పడుకుంటే ఓ దుండగుడు బంగారు పుస్తెలతాడుని ఎత్తుకెళ్లిన ఘటన బోల్లెపల్లిలో చోటు చేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
!['ఆరుబయట నిద్రిస్తే... పుస్తెల తాడు పోయింది' chain-snatching-while-sleeping-at-bhuvanagiri](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7336439-thumbnail-3x2-chain.jpg)
'ఆరుబయట నిద్రిస్తే... పుస్తెల తాడు పోయింది'