తెలంగాణ

telangana

ETV Bharat / state

kishan reddy: 'రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో గెలిచేది భాజపే' - కేంద్రమంత్రి కిషన్ రెడ్డి యాత్ర

కుటుంబ పాలన పోవాలంటే రాష్ట్రంలో భాజపా అధికారంలోకి రావాలని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. జన ఆశీర్వాద యాత్రలో భాగంగా యాదాద్రిలో పర్యటించిన ఆయన... రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది భాజపానే అంటూ ధీమా వ్యక్తం చేశారు.

kishan reddy
జన ఆశీర్వాదయాత్ర

By

Published : Aug 21, 2021, 1:37 PM IST

యాదాద్రి భువనగిరి జిల్లాలో జన ఆశీర్వాద యాత్రలో భాగంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి భువనగిరి పట్టణంలోని సాయిబాబా దేవాలయం వద్ద భాజపా కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. సాయి బాబా దేవాలయం నుంచి ప్రధాన రహదారి గుండా వినాయక్ చౌరస్తా వరకు పార్టీ కార్యకర్తలతో కలిసి ర్యాలీ నిర్వహించారు. పట్టణంలోని వినాయక్ చౌరస్తాలో ప్రజలను, కార్యకర్తలను ఉద్దేశించి మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడారు.

జన ఆశీర్వాదయాత్ర

మోదీ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని కిషన్ రెడ్డి ప్రజలను కోరారు. హుజూరాబాద్​లో భాజపాను గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి కేసీఆర్ హుజురాబాద్​లోని ఓటర్లకు ఫోన్లు చేస్తున్నారని... వందల కోట్ల రూపాయలు పంపించి ఓటర్లు కొనేయాలనుకుంటున్నారని ఆరోపించారు. భాజపా నాయకులను జైల్లో పెట్టినా... హుజురాబాద్​లో గెలిచేది భాజపానే అంటూ ధీమా వ్యక్తం చేశారు.

జన ఆశీర్వాదయాత్ర

రాష్ట్రంలో వచ్చేది భాజాపానే..

వినాయక్ చౌరస్తాలో యాత్ర కొనసాగించి కిషన్ రెడ్డి రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో తెరాస ప్రభుత్వం పోతుందని... భాజపా ప్రభుత్వం రాబోతుందని వ్యాఖ్యానించారు. తెలంగాణలో కుటుంబ పాలన పోవాలంటే.. ప్రజలు కమలం గుర్తుకు ఓటేయాలని సూచించారు. రాష్ట్రంలో మౌలిక సౌకర్యాల అభివృద్ధికి భాజపా పూర్తిగా కట్టుబడి ఉందన్నారు.

దేశంలో కరోనా వ్యాక్సిన్లు ఉచితంగా అందించాం. ప్రజలందరూ వ్యాక్సిన్ వేసుకోవాలి. గ్రామ పంచాయితీలకు, మున్సిపాలిటీలకు నిధులు, వ్యవసాయానికి సంబంధించి ప్రోత్సాహకాలు, ఎరువుల సబ్సిడీలను మోదీ ప్రభుత్వం ప్రజలకు ఇస్తుంది. కేంద్రీయ విద్యాలయాలు, నవోదయలలో ఓబీసీలకు రిజర్వేషన్లు అందించింది. నరేంద్ర మోదీ మంత్రి వర్గంలో ఓబీసీ వర్గానికి చెందిన 27 మంత్రులు ఉన్నారు. 11 మంది మహిళ మంత్రులు, 5గురు మైనారిటీ మంత్రులు ఉన్నారు. మొత్తం 84 మంది మంత్రుల్లో ఎక్కువ శాతం బడుగు బలహీన వర్గాలకు చెందినవారే ఉన్నారు.

-కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

మోదీ ప్రభుత్వం పొదుపు సంఘాలకు రూ.20 లక్షల లోన్లు ఇస్తుందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. భువనగిరి కోట అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపిస్తే... అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు.

ఇదీ చూడండి:KISHAN REDDY: 'జనవరి నుంచి పర్యాటక రంగాన్ని పునః ప్రారంభిస్తాం'

ABOUT THE AUTHOR

...view details