తెలంగాణ

telangana

ETV Bharat / state

'కేంద్రం ప్రజా వ్యతిరేక విధానాలు అవలంభిస్తోంది' - Bharat bandh

యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరిలో భారత్ బంద్​లో భాగంగా సీపీఐ, సీపీఎం, రైతు సంఘాల నాయకులు ద్విచక్రవాహన ర్యాలీ నిర్వహించారు. నల్ల చట్టాలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

Bharat bandh at bhuvanagiri
Bharat bandh at bhuvanagiri

By

Published : Mar 26, 2021, 5:07 PM IST

కేంద్ర ప్రభుత్వం కార్మిక, ప్రజా, రైతు వ్యతిరేక విధానాలను అవలంభిస్తోందని వామపక్షాలు ఆరోపించాయి. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరిలో భారత్ బంద్​లో భాగంగా సీపీఐ, సీపీఎం, రైతు సంఘాల నాయకులు ద్విచక్రవాహన ర్యాలీ నిర్వహించారు.

పోలీసులు వారిని అరెస్టు చేసి పట్టణ పోలీస్​స్టేషన్​కు తరలించారు. నాయకులు కేంద్ర ప్రభుత్వానికి, పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నల్ల చట్టాలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

ఇవీచూడండి:ఎట్టిపరిస్థితుల్లోనూ లాక్‌డౌన్‌ విధించం: సీఎం కేసీఆర్

ABOUT THE AUTHOR

...view details