యాదాద్రి భువనగిరి జిల్లాలోని తుర్కపల్లి మండలం గంధమల్ల సమీపంలోని వ్యవసాయ పొలాల వద్ద పశువులను దొంగలిస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. తొమ్మిది పశువులను స్వాధీనం చేసుకున్న అనంతరం రిమాండ్కు తరలించారు.
పశువుల దొంగలు మానిక్ రెడ్డి, కృష్ణారెడ్డి, నర్సిరెడ్డి జీడిమెట్ల బహదూర్పల్లిలోని ఒకే కుటుంబంలోని సభ్యులు. ముఠాగా ఏర్పడిన ఈ ముగ్గురూ పశువులను దొంగతనాలకు పాల్పడుతున్నారని స్థానిక సీఐ ఆంజనేయులు వెల్లడించారు.
'ఓకే కుటుంబానికి చెందిన పశువుల దొంగల అరెస్టు' - TURKAPALLI MANDAL
పశువులను దొంగిలిస్తున్న ఓకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులను యాదాద్రి భువనగిరి జిల్లాలో పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం వారి వద్దనున్న పశువులను స్వాధీనం చేసుకున్నారు.
పశువుల దొంగలు మానిక్ రెడ్డి, కృష్ణారెడ్డి, నర్సిరెడ్డి
ఇవీ చూడండి : రాజకీయ ఘర్షణలో మరో మహిళకు గాయాలు