తెలంగాణ

telangana

ETV Bharat / state

భువనగిరి కోర్టులో లోక్​ అదాలత్​ ద్వారా 111 కేసులు పరిష్కారం - cases solved through lok adalat

యాదాద్రి భువనగిరి జిల్లా కోర్టులో లోక్​ అదాలత్​ ద్వారా 111 కేసులు పరిష్కారమైనట్లు న్యాయసేవాధికార సంస్థ అధికారులు తెలిపారు. ఆయా కోర్టుల న్యాయమూర్తులు నాగరాణి, రాజు సమక్షంలో కక్షిదారులు తమ కేసులను రాజీ కుదుర్చుకున్నారు.

lok adalok
lok adalok

By

Published : Apr 10, 2021, 8:15 PM IST

యాదాద్రి భువనగిరి జిల్లా కోర్టులో లోక్ అదాలత్ నిర్వహించారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రధాన ప్రథమశ్రేణి న్యాయస్థానంలో 62, అదనపు ప్రథమ శ్రేణి న్యాయస్థానంలో 49 కేసులు పరిష్కారమైనట్లు మండల న్యాయ సేవాధికార సంస్థ అధికారులు తెలిపారు. ఆయా కోర్టుల న్యాయమూర్తులు నాగరాణి, రాజు సమక్షంలో కక్షిదారులు తమ కేసులను రాజీ కుదుర్చుకున్నారు.

లోక్ అదాలత్ కార్యక్రమాన్ని డీసీపీ నారాయణరెడ్డి, ఏసీపీ భుజంగరావు పరిశీలించారు. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు గోద వెంకటేశ్వర్లు, ఆయా బెంచీల్లో లీగల్ ఎయిడ్ న్యాయవాదులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి:నీతి ఆయోగ్ మెచ్చిన టీడీఆర్.. స్థిరాస్తి వ్యాపారుల మొగ్గు!

ABOUT THE AUTHOR

...view details