తెలంగాణ

telangana

ETV Bharat / state

వైన్ షాప్​ల వద్ద కరోనా అలర్ట్..క్యూ కోసం ప్రత్యేక గడులు - మద్యం దుకాణాల వద్ద బ్లీచింగ్ పౌడర్​తో గడులు

మద్యం దుకాణాల వద్ద కరోనా వ్యాప్తిని నివారించేందుకు రాచకొండ పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. వైరస్​ వ్యాప్తి చెందకుండా బ్లీచింగ్​ ఫౌడర్​తో గడులు గీసి, క్యూ పద్ధతిలో వ్యక్తుల మధ్య దూరం పాటించేలా ఏర్పాటు చేశారు.

carona alert at wines shops for que lines
వైన్ షాప్​ల వద్ద కరోనా అలర్ట్..క్యూ కోసం ప్రత్యేక గడులు

By

Published : Mar 21, 2020, 5:29 PM IST

కరోనా వ్యాప్తిని నివారించేందుకు రాచకొండ పోలీసులు నడుం బిగించారు. మద్యం దుకాణాల వద్ద ప్రజలు గుమికూడకుండా చర్యలు తీసుకుంటున్నారు. యాదాద్రి జిల్లా చౌటుప్పల్, సంస్థాన్​ నారాయణపూర్, భూదాన్ పోచంపల్లిలో మద్యం దుకాణాల ముందు బ్లీచింగ్ ఫౌడర్​తో గడులు గీశారు. ఆ గడుల్లో నిలబడే మద్యం కొనుగోలు చేసేలా ఏర్పాటు చేశారు.

వైన్ షాప్​ల వద్ద కరోనా అలర్ట్..క్యూ కోసం ప్రత్యేక గడులు

బ్లీచింగ్ ఫౌడర్​తో సూక్ష్మజీవులను నశింపజేయవచ్చని పోలీసులు చెబుతున్నారు. అలాగే వ్యక్తుల మధ్య దూరం ఉండటం వల్ల వైరస్​ వ్యాప్తిని కట్టడి చేయొచ్చని తెలిపారు. పోలీసుల చర్యలతో ప్రజలు, దుకాణాల యజమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఇదీ చూడండి:రాజధాని ఎక్స్​ప్రెస్​లో కరోనా కలకలం

ABOUT THE AUTHOR

...view details