యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం కొలనుపాక గ్రామంలో నిర్బంధ తనిఖీలు చేపట్టారు. డీసీపీ నారాయణరెడ్డి ఆధ్వర్యంలో 150 మంది పోలీస్ బలగాలతో సోదాలు నిర్వహించారు. సరైన ధ్రువపత్రాలు లేని 33 ద్విచక్రవాహనాలు, 2 ఆటోలు,ఓ ట్రాక్టర్ స్వాధీనం చేసుకోగా అక్రమంగా అమ్ముతున్న మద్యాన్ని పట్టుకున్నారు. వాటి విలువ రూ. 20 వేలు ఉండవచ్చని పోలీసులు అంచనా వేశారు. లైసెన్స్ లేని పిల్లలకు బైకులు ఇస్తే ప్రమాదాలకు దారితీస్తాయని డీసీపీ తెలిపారు. లైసెన్స్ లేకుండా వాహనాలు నడిపితే వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని నారాయణరెడ్డి హెచ్చరించారు.
'లైసెన్సు లేకుండా వాహనాలు నడిపితే చర్యలు తప్పవు' - cardon search
యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం కొలనుపాకలో పోలీసులు నిర్బంధ తనిఖీలు నిర్వహించారు. సరైన ధ్రువపత్రాలు లేని 33 ద్విచక్రవాహనాలు, 2 ఆటోలు, ఒక ట్రాక్టర్ స్వాధీనం చేసుకున్నారు.
నిర్బంధ తనిఖీలు