యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం కంఠంగూడెం గ్రామ శివారులో ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. మారుతి కారు బోల్తాపడి కారులో ఉన్న ముగ్గురు వ్యక్తులకు తీవ్రగాయాలయ్యాయి. వెంటనే స్పందించిన స్థానికులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆలేరు ఏరియా ఆస్పత్రికి తరలించారు. గాయపడినవారిని హైదరాబాద్ వారిగా పోలీసులు గుర్తించారు.
కారు బోల్తా.. ముగ్గురికి తీవ్రగాయాలు - యాదాద్రిలో కారు బోల్తా
కారు బోల్తాపడి ముగ్గురు వ్యక్తులు గాయపడిన ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా కంఠంగూడెం గ్రామ శివారులో జరిగింది.

కారు బోల్తా.. ముగ్గురికి తీవ్రగాయాలు