యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం బ్రాహ్మణపల్లి వద్ద ప్రమాదం జరిగింది. వేగంగా వస్తున్న ఆటో, కారు ఢీకొన్నాయి. ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న 15 మంది హిందూస్తాన్ పరిశ్రమ కార్మికులకు గాయాలయ్యాయి. క్షతగాత్రులందరిని భువనగిరి ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఆరుగురికి తీవ్ర గాయాలు కాగా... ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.
ఆటో, కారు ఢీ.. 15 మంది కార్మికులకు గాయాలు - యాదాద్రిలో రోడ్డు ప్రమాదం
ఎదురెదురుగా వచ్చిన ఆటో, కారు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 15 మంది కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. అందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా బ్రాహ్మణపల్లిలో జరిగింది.
CAR AND AUTO ACCIDENT AT BRAHNAPALLY