తెలంగాణ

telangana

ETV Bharat / state

అంత్యక్రియలకు వచ్చి... మృత్యు ఒడికి వెళ్లాడు - Came for relatives funeral..

సమీప బంధువుల అంత్యక్రియలకు వచ్చి ప్రమాదవశాత్తు వ్యవసాయ బావిలో పడి వ్యక్తి మృతి చెందిన ఘటన రాజపేట మండలంలో చోటు చేసుకుంది.

అంత్యక్రియలకు వచ్చి... మృత్యు ఒడికి వెళ్లాడు

By

Published : Oct 18, 2019, 7:59 PM IST

యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట మండలం నర్సాపురం శివారులో ప్రమాదవశాత్తు వ్యవసాయ బావిలో పడి తుమ్మ శ్రీశైలం మృతి చెందాడు. మృతుడు పదిహేను సంవత్సరాలుగా హైదరాబాదులో ఉంటున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. సమీప బంధువుల అంతక్రియలకు వచ్చి ఇంటి దగ్గరకు​ వెళ్లే క్రమంలో బావి వద్దకు వెళ్లాడు. ప్రమాదవశాత్తు బావిలో జారి పడిపోయాడు. శ్రీశైలంకు ఈత రాకపోవడం వల్ల మృతి చెందినట్లు కుటుంబసభ్యులు పేర్కొన్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతునికి భార్య, కొడుకు, కుమార్తె ఉన్నారు.

అంత్యక్రియలకు వచ్చి... మృత్యు ఒడికి వెళ్లాడు

ABOUT THE AUTHOR

...view details