తెలంగాణ

telangana

ETV Bharat / state

బైక్​ అదుపుతప్పి ప్రమాదం.. ఒకరి పరిస్థితి విషమం - బైక్​ అదుపుతప్పి ప్రమాదం... ఒకరి పరిస్థితి విషమం

ఇద్దరు స్నేహితులు ద్విచక్ర వాహనం మీద వెళ్తున్నారు. ఒక్కసారిగా బైక్​ అదుపుతప్పి ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన భువనగిరి మండలం కూనూరు సమీపంలో జరిగింది.

BYKE ACCIDENT AT KOONUR
BYKE ACCIDENT AT KOONUR

By

Published : Feb 23, 2020, 10:13 PM IST

యాదాద్రి భువనగిరి జిల్లాలోని కూనూరు శివారు వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. మల్లయ్య, లక్ష్మణాచారి అనే వ్యక్తులు రాయగిరి నుంచి వీరవెల్లికి ద్విచక్ర వాహనంపై వెళ్తున్నారు. ఒక్కసారిగా వాహనం అదుపు తప్పి కిందపడ్డారు. ఈ ప్రమాదంలో ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. మల్లయ్య పరిస్థితి విషమంగా ఉంది. అతన్ని హైదరాబాద్ ఆదిత్య ఆస్పత్రికి తరలించారు. లక్ష్మణాచారిని భువనగిరి ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

బైక్​ అదుపుతప్పి ప్రమాదం... ఒకరి పరిస్థితి విషమం

ఇదీ చూడండి:'రష్మికకు ట్వీట్‌ చేసింది కలెక్టర్​ కాదు.. పరిశ్రమలశాఖ ఉద్యోగి'

ABOUT THE AUTHOR

...view details