తెలంగాణ

telangana

ETV Bharat / state

టోకెన్​ విధానంలో ధాన్యం కొనుగోలు : మహేందర్​రెడ్డి - Nalgonda DCCB Chairmen Mahendar reddy Latest News

ఐకేపీ కేంద్రాల వద్ద టోకెన్​ విధానంలో ధాన్యం కొనుగోలు చేస్తామని ఉమ్మడి నల్గొండ జిల్లా డీసీసీబీ ఛైర్మన్​ గొంగిడి మహేందర్​ రెడ్డి తెలిపారు. యాదాద్రి జిల్లా యాదగిరిగుట్ట మండలం మల్లాపురం గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు.

ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాలు
ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాలు

By

Published : Apr 15, 2020, 12:26 PM IST

లాక్​డౌన్ అమల్లో ఉన్నందున ఐకేపీ కేంద్రాల వద్ద రైతులు సమూహంగా ఉండకూడదని ఉమ్మడి నల్గొండ జిల్లా డీసీసీబీ ఛైర్మన్​ గొంగిడి మహేందర్​ రెడ్డి సూచించారు. రైతులందరూ భౌతిక దూరం పాటించాలని కోరారు. యాదాద్రిభువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం మల్లాపురం గ్రామంలో ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. యాదాద్రి జిల్లా వ్యాప్తంగా కోటి గన్నీ సంచులు అవసరం ఉండగా... 30 లక్షలు మాత్రమే అందుబాటులో ఉన్నాయన్నారు. కలెక్టర్​తో మాట్లాడి గన్నీ బ్యాగుల కొరత లేకుండా చూస్తామన్నారు.

ABOUT THE AUTHOR

...view details