తెలంగాణ

telangana

ETV Bharat / state

'భువనగిరికి 5 వేల కోట్లకు పైగా నిధులు తెచ్చాను' - KCR

కోమటి రెడ్డి వెంకటరెడ్డి చెల్లని రూపాయి. అసెంబ్లీలో ఓడిన వ్యక్తికి ఎలా ఓటేస్తారు. భువనగిరికి 5వేల కోట్లకు పైగా నిధులు వచ్చేలా చేశా. మరోసారి అవకాశమిస్తే.. మరింత అభివృద్ధి చేసి చూపిస్తా: వలిగొండ రోడ్​షోలో బూర నర్సయ్య గౌడ్​

బూర నర్సయ్య ప్రచారం

By

Published : Mar 30, 2019, 7:30 PM IST

Updated : Mar 30, 2019, 7:59 PM IST

బూర నర్సయ్య ప్రచారం
భువనగిరి నియోజకవర్గానికి రూ.5,641 కోట్ల నిధులుతెచ్చి పెట్టానని ఎంపీ బూర నర్సయ్య గౌడ్ అన్నారు. రీజనల్ రింగ్ రోడ్డు కూడా అనుమతి లభించిందని దాన్ని కలుపుకుంటే 12 వేల కోట్లు వస్తుందని తెలిపారు. ఈరోజు యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలో నర్సయ్య రోడ్​ షో నిర్వహించారు. బీబీనగర్​ వద్ద ఎయిమ్స్​ వెయ్యి పడకల ఆస్పత్రి తీసుకొచ్చానని గుర్తు చేశారు. గతంలో 33 మంది కాంగ్రెస్​ ఎంపీలు ఉన్నా చేసిందేమి లేదని విమర్శించారు. పాస్ పోర్ట్ కేంద్రం, కేంద్రీయ విద్యాలయం, 524 కిలోమీటర్ల జాతీయ రహదారులు తీసుకురావడం గులాబీ జెండాతోనే సాధ్యమైందని ఎంపీ పేర్కొన్నారు. కోమటి రెడ్డి వెంకటరెడ్డి చెల్లని రూపాయి అని బూర నర్సయ్య గౌడ్ ఎద్దేవా చేశారు.

మరోసారి గెలిపిస్తే.. మరింత అభివృద్ధి చేసి చూపిస్తానని బూర హామీ ఇచ్చారు. కారు గుర్తుకే ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.

Last Updated : Mar 30, 2019, 7:59 PM IST

ABOUT THE AUTHOR

...view details