తెలంగాణ

telangana

ETV Bharat / state

కాంగ్రెస్ పార్టీ​కి బూడిద భిక్షమయ్యగౌడ్‌ రాజీనామా - PRIMARY MEMBERSHIP

మహా సముద్రం లాంటి కాంగ్రెస్ పార్టీలో బీసీ నేతలను బలహీనపరుస్తున్నారని నల్గొండ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు బూడిద భిక్షమయ్యగౌడ్‌ ఆవేదన వ్యక్తం చేశారు. తన పదవికి రాజీనామా చేశారు.

బీసీ నేతలను కోమటిరెడ్డి సోదరులు బలహీనపరుస్తున్నారు : భిక్షమయ్య గౌడ్‌

By

Published : Mar 24, 2019, 8:31 PM IST

కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేసిన బూడిద భిక్షమయ్యగౌడ్‌
నల్గొండ డీసీసీ అధ్యక్ష పదవికి బూడిద భిక్షమయ్యగౌడ్‌ రాజీనామా చేశారు. కాంగ్రెస్‌ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికీ రాజీనామా చేస్తున్నట్లు భిక్షమయ్య స్పష్టం చేశారు. కాంగ్రెస్​ టిక్కెట్ల కేటాయింపులో సామాజిక న్యాయం అమలు కాకుండా కోమటిరెడ్డి సోదరులు అడ్డుకుంటున్నారని ఆరోపించారు. వీరి వైఖరి వల్లే పార్టీని వీడుతున్నట్లు పేర్కొన్నారు. తన అనుచరులతో కలిసి తెరాసలో చేరనున్నట్లు పేర్కొన్నారు.

ఇవీ చూడండి :మొజాంబిక్​లో 417కు చేరిన ఇదాయ్​ మృతుల సంఖ్య


ABOUT THE AUTHOR

...view details