తెలంగాణ

telangana

ETV Bharat / state

నేటి నుంచి యాదాద్రిలో వార్షిక బ్రహ్మోత్సవాలు

యాదాద్రి పుణ్యక్షేత్రంలో సోమవారం నుంచి శ్రీలక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. 11రోజుల పాటు కొనసాగే ఉత్సవాలు ఈ నెల 25న ముగుస్తాయి.

నేటి నుంచి యాదాద్రిలో వార్షిక బ్రహ్మోత్సవాలు
నేటి నుంచి యాదాద్రిలో వార్షిక బ్రహ్మోత్సవాలు

By

Published : Mar 15, 2021, 2:50 AM IST

యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహ స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధమైంది. ఇవాళ్టి నుంచి 11 రోజుల పాటు వైభవంగా వేడుకలు జరగనున్నాయి. విష్వక్సేనారాధన, స్వస్తివాచనం, రక్షాబంధనంతో మొదలయ్యే ఉత్సవాలు... 25న డోలోత్సవంతో ఉత్సవాలు పరిసమాప్తం కానున్నాయి. 16న ధ్వజారోహణం,రాత్రి భేరిపూజ నిర్వహించనున్నారు. 17 నుంచి 23 వరకు వివిధ అలంకార సేవలపై బాలాలయంలో స్వామి వారిని విహరింపచేయనున్నారు. 21 న రాత్రి ఎదుర్కోలు, 22న తిరుకల్యాణం నిర్వహించనున్నారు.

కొండకింద పాత హైస్కూల్ గ్రౌండ్​లో భక్తులు వీక్షించేందుకు వీలుగా వైభవోత్సవ కల్యాణం నిర్వహించనున్నారు. చలువ పందిర్లు, విద్యుత్ దీపాలంకరణ, యాగశాల, బలిపీఠం, స్వామివారి అలంకార సేవలకు ఉపయోగించేవాహన సేవలను సిద్ధం చేశారు. ఈనెల 11న హైదరాబాద్‌ యాదగిరి భవన్‌లో ప్రారంభమైన అఖండజ్యోతి పాదయాత్ర యాదాద్రికి చేరుకుంది.

ఇదీ చదవండి:'బడ్జెట్‌ సమావేశాల్లో ఏం సమస్యలను ప్రస్తావించాలి..?'

ABOUT THE AUTHOR

...view details