తెలంగాణ

telangana

ETV Bharat / state

వైభవంగా యాదాద్రి బ్రహ్మోత్సవాలు

తెలంగాణ తిరుపతిగా పిలవబడే యాదాద్రిలో స్వామి వారికి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. స్వామిని పెళ్లికొడుకుగా తీర్చిదిద్దే పర్వంలో ముగ్ధరూపుడైన శ్రీకృష్ణుడి అలంకరణలో ముస్తాబు చేశారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.

వైభవంగా యాద్రాద్రి బ్రహ్మోత్సవాలు

By

Published : Mar 12, 2019, 9:45 AM IST

Updated : Mar 12, 2019, 10:07 AM IST

యాదాద్రిలో అంగరంగ వైభవంగా బ్రహ్మోత్సవాలు
అజ్ఞాన తిమిరాన్ని అంతం చేసి దుష్ట శిక్షణ, శిష్ట రక్షణే ధ్యేయంగా ముల్లోకాలను ఏలుతున్న నరసింహుడు యాదాద్రిలో విశేష పూజలందుకుంటున్నాడు. విశిష్ట పర్వాలలో భాగంగా రోజుకు రెండు రూపాల్లో భక్త జనులను కటాక్షిస్తున్నారు. వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా యాదగిరీశుడు సకల దేవతల సమక్షంలో పెళ్లికొడుకుగా మారబోతున్నారు.

మురళీ కృష్ణుడిగా నరసింహుడు
ఉత్సవాల్లో నాలుగో రోజైన సోమవారం ఉదయాన మురళీకృష్ణుడిగా దర్శనమిచ్చిన స్వామివారురాత్రికి హంస వాహనంపై విహరించారు. పాలలో నీటిని వేరు చేసినట్లు... మనుషుల్లో నెలవైన అవినీతి, ఆశ్రిత పక్షపాతం, అధర్మాన్ని వేరు చేసేలాధర్మ రక్షణ కోసంహంస వాహన సేవ జరిగింది. శ్రీకృష్ణ లీలలు, నరసింహ అవతారాలతో కలిగిన లోక సంరక్షణ పారాయణాలు,వేదాలను పండితులు వివరించారు.

బ్రహ్మోత్సవాల్లో ప్రధాన ఘట్టాలుగా భావించే ఎదుర్కోలు ఉత్సవం ఈ నెల 14న జరగనుంది. 15న స్వామి, అమ్మవార్ల కల్యాణం నిర్వహిస్తారు.

Last Updated : Mar 12, 2019, 10:07 AM IST

ABOUT THE AUTHOR

...view details