తెలంగాణ

telangana

ETV Bharat / state

నీటి సంపులో పడి బాలుడు మృతి - yadadri bhuvanagiri district news

యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలో విషాదం చోటుచేసుకుంది. నీటి సంపులో పడి గొలుసులు ప్రణీత్​ కుమార్​ అనే బాలుడు మృతి చెందాడు. కుమారుడి మృతితో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు.

boy fell in underground  watertank and died in yadadri bhuvangiri district
నీటి సంపులో పడి బాలుడు మృతి

By

Published : Aug 25, 2020, 6:40 PM IST

నీటి సంపులో పడి బాలుడు మృతి చెందిన ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలో చోటుచేసుకుంది. గొలుసుల రాజు, ప్రేమలతల కుమారుడు గొలుసుల ప్రణీత్​ కుమార్ అనే బాలుడు స్నానం చేయటానికి, నీటిని తోడుకోవడానికి నీటి సంపులోకి వంగి పట్టుతప్పి సంపులో పడి మృతి చెందాడు.
ఎవరూ లేని సమయంలో బాలుడు సంపులో పడగా... ఆలస్యంగా బాలుడి నానమ్మ సంపులో పడ్డట్లు గుర్తించి బయటికీ తీసింది. అప్పటికే బాలుడు మృతి చెందాడు. కుమారుడు మృతి చెందడం వల్ల తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఈ ఘటనపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని స్థానిక పోలీసులు పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details