Boora Narsiah Goud resigned from TRS మునుగోడు ఉపఎన్నిక వేళ అధికార తెరాసకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. తెరాస నేత, మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్ భాజపాలో చేరేందుకు సిద్ధమయ్యారు. మునుగోడు నియోజకవర్గంలో పెద్దఎత్తున ఉన్న గౌడ సామాజికవర్గాన్ని ఆకర్షించడానికి బూరతో భారతీయ జనతా పార్టీ నేతలు చేసిన ప్రయత్నాలు ఫలించాయి. అమిత్‌షా సమక్షంలో బూర భాజపా కండువా కప్పుకోనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే తెరాస పార్టీ సభ్యత్వానికి బూర నర్సయ్య గౌడ్ రాజీనామా చేశారు.
తెరాసకు బూర నర్సయ్య గౌడ్ రాజీనామా
09:34 October 15
తెరాసకు బూర నర్సయ్యగౌడ్ రాజీనామా
Boora Narsiah Goud join to bjp శుక్రవారం భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డాను కలిసిన బూర... భాజపాలో చేరేందుకు సిద్ధమయ్యారని తెలిసింది. 2013లో తెరాసలో చేరిన బూర... 2014 లోక్‌సభ ఎన్నికల్లో భువనగిరి ఎంపీగా పోటీ చేసి గెలుపొందారు. 2019లో తెరాస నుంచి పోటీచేసిన ఆయన... కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చేతిలో ఓడిపోయారు. మునుగోడు ఉపఎన్నిక తెరాస తరఫున టికెట్ ఆశించారు.
Munugode bypoll కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డిని తెరాస అభ్యర్థిగా ప్రకటించడంతో బూర నర్సయ్య అసంతృప్తికి గురయ్యారు. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఆయనతో మాట్లాడిన తర్వాత... తెరాస అభ్యర్థి విజయం కోసం కృషి చేస్తానని చెప్పారు. అసంతృప్తితో ఉన్న బూర నర్సయ్యను పార్టీలోకి చేర్చుకోవడానికి భాజపా ప్రయత్నించింది. మునుగోడు నియోజకవర్గంలో భారీ స్థాయిలో ఉన్న గౌడ సామాజికవర్గ ఓట్లను ఆకర్షించడానికి బూరతో చర్చలు జరిపింది. చర్చలు కొలిక్కిరావడంతో బూర నర్సయ్యగౌడ్ దిల్లీకి వెళ్లారు.
Boora Narsiah Goud meet amit shah భాజపా జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డాతో సమావేశమై ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇవాళ అమిత్‌షాను కలిసి కాషాయ కండువా కప్పుకోనున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో భువనగిరి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్ధిగా బూర నర్సయ్య పోటీ చేస్తారని... ఈ మేరకు భాజపా అధిష్ఠానం నుంచి హామీ లభించినట్లు ఆయన వర్గీయులు చెబుతున్నారు. తెరాస మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ అంశంపైనా కూడా తెరాసలో చర్చ జరుగుతోంది. బూర నర్సయ్య పార్టీ మార్పు నేపథ్యంలో కర్నెతో మాట్లాడానికి సంప్రదించగా ఆయన అందుబాటులోకి రానట్లు తెలుస్తోంది.