భువనగిరి జిల్లా కేంద్ర ఆసుపత్రి మార్చురీ వద్దకు వచ్చిన మృతురాలు లక్ష్మి పిల్లలు.. తన తల్లిని చంపిన నిందితుడు ఆర్య కుమార్ గౌడ్‌ను ఎన్ కౌంటర్ చేయాలని మృతురాలి కొడుకు సురేష్ అన్నారు. తమ వద్దనే డబ్బులు తీసుకుని, తమని వేధింపులకు గురి చేశాడని మృతురాలి కూతుర్లు క్రాంతి, కీర్తన ఆవేదన వ్యక్తం చేశారు.
'మా అమ్మను చంపింది అతనే... ఎన్కౌంటర్ చేయండి'
మా అమ్మను అన్యాయంగా పొట్టన పెట్టుకున్నారంటూ యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి బైపాస్ రోడ్డు సమీపంలో నిన్న సాయంత్రం హత్యకు గురైన బోలు లక్ష్మి పిల్లలు ఆవేదన వ్యక్తం చేశారు. తల్లి మృతి చెందడంతో అనాథలుగా మారమని విలపించారు.
ఈ విషయంపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో రెండు సార్లు ఫిర్యాదు చేసినా మమ్మల్ని పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అప్పుడే పోలీసులు పట్టించుకుని నిందితుడు ఆర్య కుమార్ గౌడ్‌పై కేసులు నమోదు చేసి ఉంటే... ఈరోజు తన తల్లి లక్ష్మి మృతి చెందేది కాదని విలపించారు.
నిందితుడిపై కఠినమైన సెక్షన్లతో కేసు నమోదు చేయాలని పోలీసులను కోరారు. వివాహేతర సంబంధం అంటూ మీడియాలో వార్తలు రావడం తమని మరింత బాధకు గురిచేసిందని మృతురాలి పిల్లలు సురేష్, క్రాంతి, కీర్తన ఆవేదన వ్యక్తం చేశారు.
- ఇవీచూడండి:కరోనాతో భాజపా ఎమ్మెల్యే మృత