తెలంగాణ

telangana

ETV Bharat / state

యాదాద్రిలో ప్రసాదాల తయారీ సమస్య.. బాయిలర్లు పనిచేయకనే! - boilers are not working in yadadri temple

దేవుని దర్శనం పూర్తయ్యాక ప్రసాదం ఎప్పుడు పెడతారా అని ఎదురుచూడటం ప్రతి భక్తుని నైజం. పెట్టేది కొంచెం అయినా నోట్లో వేసుకొని రుచిని ఆస్వాదించి తృప్తి పడుతుంటారు భక్తులు. ముఖ్యంగా యాదాద్రి ఆలయంలో ప్రసాదాలకు ఎంతో ప్రాధాన్యం ఉంటుంది. కానీ కొన్ని నెలలుగా అక్కడ బాయిలర్లు పనిచేయకపోవడంతో భక్తులు ప్రసాదం దొరకక నిరాశతో వెనుదిరుగుతున్నారు.

boilers are not working in yadadri temple
యాదాద్రిలో ప్రసాదాల తయారీ సమస్య.. బాయిలర్లు పనిచేయకనే!

By

Published : Oct 28, 2020, 7:11 PM IST

యాదాద్రి భువనగిరి జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ప్రసాదాల సమస్య నెలకొంది. పులిహోర తయారీలో వినియోగించే స్టీమ్ బాయిలర్లు పని చేయకపోవడంతో ప్రసాదాల తయారీకి ఆటంకాలు ఏర్పడ్డాయి. దాదాపు మూడు నెలలుగా బాయిలర్లు చెడిపోవడంతో వంట పాత్రల ద్వారా ప్రసాదాన్ని తయారు చేస్తున్నారు.

ఎక్కువగా విక్రయించే పులిహోర ప్రసాదం తయారీ త్వరితగతిన కావాలని ఆలయ నిర్వాహకులు ఈ బాయిలర్లు ఏర్పాటు చేశారు. ఒకేసారి క్వింటాలు బియ్యం ఉడికేటట్లు ఏర్పాటు చేసిన రెండు బాయిలర్లు పనిచేయకపోవడంతో 25 కిలోల బియ్యం వండే పాత్రను వినియోగిస్తున్నారు.

దీంతో సిబ్బంది ప్రసాదాల తయారీలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సంబంధిత అధికారులు ఈ విషయంపై చొరవ చూపాల్సి ఉంది.

ఇదీ చదవండి:'మాకొచ్చిన కష్టం మరెవ్వరికీ రాకూడదు... నిందితుడిని వెంటనే శిక్షించాలి'

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details