తెలంగాణ

telangana

ETV Bharat / state

రక్తదానం చేసేందుకు యువత ముందుకు రావాలి: డీసీపీ - blood donation camp latest news

పోలీసు శాఖ, రెడ్ క్రాస్ ఇండియా సంయుక్త ఆధ్వర్యంలో యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని పోలీస్ హెడ్ క్వార్టర్స్​లో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరాన్ని డీసీపీ నారాయణ రెడ్డి ప్రారంభించారు.

blood donation camp in yadadri bhuvanagiri district
భువనగిరిలో రక్తదాన శిబిరం.. ప్రారంభించిన డీసీపీ

By

Published : Sep 5, 2020, 2:02 PM IST

యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో జిల్లా పోలీసు శాఖ, రెడ్ క్రాస్ ఇండియా సంయుక్త ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరాన్ని డీసీపీ నారాయణ రెడ్డి ప్రారంభించారు. యువకులు, పోలీసు సిబ్బంది రక్తదానం చేశారు.

కరోనా నేపథ్యంలో రక్తం ఇవ్వడానికి ఎవరూ ముందుకు రావట్లేదని, ఈరోజు ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరం ద్వారా 150 నుంచి 200 యూనిట్ల రక్తాన్ని సేకరించనున్నట్లు డీసీపీ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా మరిన్ని రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేస్తామని అన్నారు. రక్తం ఇవ్వడానికి ముందుకు వచ్చిన యువకులు, పోలీసులను డీసీపీ నారాయణ రెడ్డి అభినందించారు.

ఇదీ చూడండి:'సరిహద్దుల్లో యథాతథ స్థితిని పునరుద్ధరించాల్సిందే!'

ABOUT THE AUTHOR

...view details