రక్తదానం చేయడం అంటే ప్రాణ దానం చేయడమేనని మోత్కూరు ఎస్సై డి. ఉదయ్‌కిరణ్ అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండలం పాటిమట్ల గ్రామంలో 'మాతృదేవోభవ-పితృదేవోభవ' అనే స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. ఆయన కూడా రక్తదానం చేసి యువతకు ఆదర్శంగా నిలిచాడు. సేవ చేయాలనే సంకల్పం ఉన్నవారికి హద్దులు ఉండవని, ఎక్కడికైనా వెళ్లి అపన్నహస్తం అందిస్తారని ఎస్సై అన్నారు.
'రక్తదానం చేయడమంటే ప్రాణదానం చేయడమే' - రక్తదాన శిబిరం
రక్తదానం చేయడమంటే ప్రాణదానం చేయడమేనని మోత్కూరు ఎస్సై అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా పాటిమట్ల గ్రామంలో ఓ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదానం కార్యక్రమాన్ని ప్రారంభించి... ఆయన కూడా రక్తదానం చేశారు. ఇలాంటి కార్యక్రమాల వల్ల సమాజం గర్విస్తుందన్నారు.
మారుమూల గ్రామం పాటిమట్లలో ఇంతమంది యువకులు రక్తదానం చేయడం అభినందనీయమని అన్నారు. రక్తదానం చేసినప్పుడు అది రోగికి మాత్రమే కాకుండా వారిపై ఆధారపడిన కుటుంబసభ్యులకు కూడా సహాయం చేసినట్లు అవుతుందన్నారు. ఇలాంటి కార్యక్రమాల వల్ల సమాజం గర్విస్తుందని అన్నారు. ఈ రక్తదాన శిభిరంలో 55 యూనిట్ల రక్తం సేకరించి హైదరాబాద్‌లోని శ్రీ లక్ష్మీ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి& బ్లడ్ బ్యాంకుకు అందించినట్లు సంస్థ ఛైర్మన్ కురిమేటి నవీన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ నర్సింగ్ సమితి రాష్ట్ర అధ్యక్షుడు కురుమేటి గోవర్ధన్, మాదిగ యూత్ జేఏసీ గ్రేటర్ హైదరాబాద్ ప్రెసిడెంట్ చిరుమర్తి రాజు, శ్రీ లక్ష్మీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్& బ్లడ్ బ్యాంకు డైరెక్టర్ వేణుగోపాల్, మల్లికార్జున్, విజయభాస్కర్ రెడ్డి, గ్రామ సర్పంచ్ దండబోయిన మల్లేష్, స్వచ్ఛంద సంస్థ ఉపాధ్యక్షుడు కురుమేటి నరేందర్, కోశాధికారి వంశీకృష్ణ, గ్రామ యువకులు, తదితరులు పాల్గొన్నారు.
ఇవీ చూడండి: మరో రోమన్ చక్రవర్తిలా ముఖ్యమంత్రి కేసీఆర్: భట్టి