యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో స్థానిక యువ టీం, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ యాదాద్రి భువనగిరి జిల్లా శాఖ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. రక్తదాన శిబిరాన్ని స్థానిక ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి ప్రారంభించారు. రక్తదానం చేయటానికి యువకులు చాలా మంది ముందుకు వచ్చారు. లాక్డౌన్ నేపథ్యంలో రక్తం దొరకటం కష్టంగా ఉందని ఎమ్మెల్యే శేఖర్‌రెడ్డి అన్నారు. జిల్లాలో ఒక్క కరోనా కేసు నమోదు కాకపోవడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు.
భువనగిరిలో మెగా రక్తదాన శిబిరం - lockdown
భువనగిరి ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో స్థానిక యువ టీం, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ యాదాద్రి భువనగిరి జిల్లా శాఖ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు.
భువనగిరిలో మెగా రక్తదాన శిబిరం
అందరూ లాక్డౌన్ నిబంధనలు పాటించాలని ఆయన సూచించారు. ఈ సమయంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసిన యువ టీం అధ్యక్షులు సుధగాని రాజు గౌడ్‌ను ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి అభినందించారు.
ఇవీ చూడండి: కోహెడ మార్కెట్‌ను సందర్శించిన ఎంపీ రేవంత్ రెడ్డి