దిల్లీలో గత ఎన్నికల్లో 3 సీట్లకే పరిమితమైన భాజపా ప్రజల మన్ననలతో నేడు భారీ సీట్లు గెలుచుకుందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ ధీమా వ్యక్తం చేశారు. స్థానిక పరిస్థితుల దృష్ట్యా ఆప్ వంటి పార్టీలు ప్రజల మద్దతు పొందుతున్నాయే తప్ప ప్రజలంతా భాజపా వైపే ఉన్నారన్నారు.
'ఆప్, కాంగ్రెస్ కుమ్మక్కైనా... దిల్లీలో భాజపా పుంజుకుంది' - Delhi assembly elections 2020
దిల్లీ ఎన్నికల్లో ఆమ్ఆద్మీ, కాంగ్రెస్ పార్టీలు కుమ్మక్కైనా.. భాజపా పుంజుకుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ అన్నారు. కుటుంబ సమేతంగా యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్నారు.
యాదాద్రి లక్ష్మీనరసింహుని సేవలో లక్ష్మణ్
పౌరసత్వ సవరణ బిల్లు ఏ ఒక్క మతానికి, కులానికి, వర్గానికి వ్యతిరేకం కాకపోయినా, ప్రధాని మోదీ తీసుకుంటున్న చారిత్రాత్మక నిర్ణయాలు జీర్ణించుకోలేక కొన్ని పార్టీలు విషప్రచారం చేస్తున్నాయని లక్ష్మణ్ మండిపడ్డారు. తెలంగాణలో ప్రజాసమస్యలపై పోరాటాలు చేస్తూ 2023 ఎన్నికల్లో రాష్ట్రంలో భాజపా అధికారంలోకి రావడానికి కృషి చేస్తామన్నారు.
కుటుంబ సమేతంగా లక్ష్మణ్ యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు చేసి స్వామి ఆశీర్వాదం తీసుకున్నారు.
- ఇదీ చూడండి :దిల్లీ తీర్పు: హస్తినను మరోసారి ఊడ్చేసిన ఆప్