తెలంగాణ

telangana

ETV Bharat / state

'అయోధ్య రామాలయానికి 16 లక్షల గ్రామాల్లో విరాళాలు' - యాదాద్రి భువనగిరి జిల్లాలో రామ మందిర నిధుల సేకరణ

అయోధ్య రామ మందిర నిర్మాణం 500 ఏళ్ల భారతీయుల ఆకాంక్ష అని భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు గంగిడి మనోహర్ రెడ్డి అన్నారు. దేశ వ్యాప్తంగా 16 లక్షల గ్రామాల్లో విరాళాలు సేకరిస్తున్నారని తెలిపారు. ఫిబ్రవరి 10 వరకు నిధులు సేకరించి సమర్పణ చేస్తామని వెల్లడించారు.

BJP state vice president Gangidi Manohar Reddy in fundraising
'16 లక్షల గ్రామాల్లో విరాళాలు సేకరిస్తున్నారు'

By

Published : Jan 30, 2021, 2:58 PM IST

అయోధ్య రామ మందిర నిర్మాణం ఎన్నో ఏళ్ల భారతీయుల కల అని భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు గంగిడి మనోహర్ రెడ్డి అన్నారు. ఈ పవిత్ర కార్యానికి భారతీయులందరు స్వచ్ఛందంగా విరాళాలు అందచేస్తున్నారని ఆనందం వ్యక్తం చేశారు.

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధి లింగోజిగూడెంలోని ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, విరాళాలు సేకరించారు. ప్రజలందరినీ భాగస్వామ్యం చేస్తూ ర్యాలీ నిర్వహించి, రామ నామ స్మరణతో ఇంటింటికి వెళ్లి నిధులు సమీకరించారు. 500 ఏళ్ల భారతీయుల ఆకాంక్ష నెరువేరుతున్న తరుణంలో దేశ వ్యాప్తంగా 16 లక్షల గ్రామాల్లో విరాళాలు సేకరిస్తున్నారని తెలిపారు. ఫిబ్రవరి 10 వరకు విరాళాలు సేకరించి సమర్పణ చేస్తామని వెల్లడించారు.

ఇదీ చూడండి: ఆచార్యతో మంత్రి అజయ్​ 'చిరు' హాసం

ABOUT THE AUTHOR

...view details