తెలంగాణ

telangana

ETV Bharat / state

కాంగ్రెస్​ నాయకులకు నైతిక హక్కు లేదు: లక్ష్మణ్​ - భాజపా

భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్​ యాదాద్రి  నరసింహ స్వామిని దర్శించుకున్నారు. కొండకింద గాంధీ సంకల్ప యాత్ర ప్రారంభించారు. కాంగ్రెస్​, తెరాసను విమర్శించారు.

కాంగ్రెస్​ నాయకులకు నైతిక హక్కు లేదు: లక్ష్మణ్​

By

Published : Oct 30, 2019, 6:05 PM IST

కాంగ్రెస్​ నాయకులకు నైతిక హక్కు లేదు: లక్ష్మణ్​
భాజపాను విమర్శిస్తున్న కాంగ్రెస్ నాయకులకు నైతిక హక్కు లేదని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్​ మండిపడ్డారు. యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కొండకింద గాంధీ విగ్రహానికి పూలమాల వేసి సంకల్ప యాత్రను ప్రారంభించారు.

పేరు చివర గాంధీ అని పెట్టుకున్నంత మాత్రన బాపూజీ వారసులు కాలేరని లక్ష్మణ్​ ఎద్దేవా చేశారు. అహింసవాదానికి భిన్నంగా హింస, విభజన రాజకీయలు చేసి పబ్బం గడుపుకునే వారికి భాజపాను ప్రశ్నించే హక్కు లేదని లక్ష్మణ్​ ధ్వజమెత్తారు. ఆర్టీసీ కార్మికులు శాంతియుతంగా సమ్మె చేస్తుంటే సీఎం కేసీఆర్ అవహేళన చేస్తున్నారన్నారు.

ABOUT THE AUTHOR

...view details